Bengaluru Roads : దేశ ఐటీ రాజధాని బెంగళూరులో అధ్వాన రోడ్లు, అస్తవ్యస్తమైన ట్రాఫిక్‌తో వాహనదారులు, ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోతుండంతో కంపెనీలు తరలివెళ్లిపోతున్నాయి. ఈ క్రమంలో నగరమంతా దుమ్ముతో నిండిపోతున్నదని, రానున్న ఐదేండ్లలో కూడా ఈ పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం కన్పించకపోవడంతో తాను కార్యాలయాన్ని ఇక్కడి నుంచి తరలించాలని నిర్ణయించుకున్నట్టు బ్లాక్‌బక్ ప్రకటించింది. దీంతో ప్రభుత్వంలో చలనం వచ్చింది. నగరంలో గుంతల రోడ్లను వెంటనే సరిచేయాలని అధికారులకు సీఎం సిద్దరామయ్య ఆదేశాలు జారీచేశారు. నెల రోజుల్లోపు నగరంలోని అన్ని రోడ్లను సరిచేయాలని, ట్రాఫిక్ సమస్యను తీర్చాలని డెడ్‌లైన్ విధించారు. రోడ్లు బాగుచేయడానికి వెంటనే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లు బాగుచేయడానికి వానాకాలం ముగిసే వరకు ఎదురుచూడాలా అని మండిపడ్డారు. బెంగళూరు రోడ్ల దుస్థితిపై జాతీయ వ్యాప్తంగా మీడియాలో వస్తున్న కథనాలపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘‘నేను ఢిల్లీలో పర్యటించాను. ప్రధాని నివాసం రోడ్డులో వెళ్తున్నప్పుడు పెద్ద గుంతలు కనిపించాయి. మరి వాటిని ఏ మీడియా అయినా చూపిస్తోందా?. గుంతల రోడ్లు అనేది బెంగళూరుకే పరిమితం కాలేదు. ఇదొక జాతీయ సమస్య. కానీ, మీడియా కేవలం బెంగళూరునే లక్ష్యంగా చేసుకుంది.. ఎందుకు?. గత బీజేపీ ప్రభుత్వం ఆ పని సక్రమంగా చేసి ఉంటే.. బెంగళూరుకు ఇవాళ ఈ దుస్థితి ఏర్పడేది కాదు కదా. అయినా మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నంలోనే ఉంది’’ అని అన్నారాయన.
Bengaluru in Trouble! 🚨 The IT capital is reeling under pothole-ridden roads, traffic chaos, and pollution.
👉 Logistics giant BlackBuck has announced shifting its office out of the city, sparking panic in the government. 👉 CM Siddaramaiah has issued a 1-month deadline to repair all city roads and ease traffic. 👉 Dy CM D.K. Shivakumar hit out at media for targeting only Bengaluru while assuring that the Congress govt will act with commitment.
Stay tuned for the latest Bengaluru & Karnataka updates!
Be the first to comment