Diarrhea Cases on Karnataka Pilgrims : కర్ణాటకకు చెందిన 11 మంది యాత్రికులు డయేరియాతో శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. పుణ్యక్షేత్రాల సందర్శనం కోసం కర్ణాటక నుంచి బస్సులో బయలుదేరిన 54 మంది యాత్రికులు వివిధ క్షేత్రాలు సందర్శించుకుంటూ రామేశ్వరం వెళ్తుండగా అస్వస్థతకు గురయ్యారు. వీరిలో కొంతమంది మూడురోజుల క్రితం ఒడిశాలోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. మళ్లీ ఆస్వస్థతకు గురవ్వడంతో టెక్కలి ఆసుపత్రిలో చేరి చికిత్సపొందుతున్నారు. దీంతో వారు యాత్ర విరమించుకుని రైళ్లు, బస్సుల్లో స్వస్థలానికి బయలుదేరారు.