Srikalahasti Temple Huge Income : వాయులింగేశ్వరుడు కొలువుదీరిన శ్రీకాళహస్తీశ్వరాలయం ఆదివారం నాడు భక్తజన సంద్రంగా మారింది. వేసవి సెలవులు, అందులోనూ ఆదివారం, అమావాస్య కలిసి రావడంతో దేవాలయంలో మహాశివరాత్రిని తలపించే రీతిలో భక్తులు పొటెత్తారు. ముక్కంటి ఆలయ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా నిన్న ఒక్క రోజే రూ.కోటికి పైగా రాబడి వచ్చింది. ఉదయం నుంచి రాత్రి వరకు దాదాపు 32,000ల మంది భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారని అధికారులు భావిస్తున్నారు.
Be the first to comment