Maha Shivaratri Celebrations in Srisailam 2025 : ఓంకార నాదాలతో ఇల కైలాసం మార్మోగింది. మహాశివరాత్రి రోజున శ్రీశైల మల్లన్న క్షేత్రానికి భక్తులు దండులా కదిలారు. లక్షలాదిమంది పాతాళగంగలో పుణ్య స్నానమాచరించారు. మల్లన్న ప్రభోత్సవం చూసి తరించారు. నందివాహన సేవలో పాల్గొని పులకించారు. పాగాలంకరణ వీక్షించి పరవశించిపోయారు. భ్రమరాంబ, మల్లికార్జునుల కల్యాణం చూసి పునీతులయ్యారు. బుధవారం తెల్లవారుజాము నుంచే భక్తులు బారులుతీరారు గంటల తరబడి క్యూలైన్లలో నిల్చొన్నారు.
Be the first to comment