Telangana Inter Results Released By Bhatti Vikramarka : రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రానా ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను tgbie.cgg.gov.in, results.eenadu.net వెబ్‌సైట్‌లలో తెలుసుకోవచ్చు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్‌ను ఎంటర్ చేసి ఫలితాలు పొందొచ్చు. ఈసారి ఫలితాల్లోనూ మళ్లీ బాలికలే ముందంజలో ఉన్నారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వ తరుఫున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందనలు తెలియజేశారు. ప్రతి విద్యార్థి జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు.
Be the first to comment