Skip to playerSkip to main content
  • 10 months ago
East Godavari District SP Press Meet On Pastor Praveen Death : రోడ్డు పక్కన మృతదేహం ఉందని మంగళవారం ఉదయం తెలిసిందని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ తెలిపారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారన్నారు. మృతదేహం పక్కనే సెల్‌ఫోన్‌ గుర్తించారన్నారు. చివరి ఫోన్‌ కాల్‌ రామ్మోహన్‌ ఆర్‌జేవైకి వెళ్లినట్టుగా ఉందని తెలిపారు. పోలీసులు ఆయనకు ఫోన్‌ చేయగా రామ్మోహన్‌, అతని భార్య ఘటనాస్థలికి చేరుకుని ఆ మృతదేహం ప్రవీణ్‌దిగా గుర్తించారన్నారు. ప్రవీణ్‌ హైదరాబాద్‌లో ఉంటారని, వివిధ ప్రాంతాల్లో మత బోధకుడిగా సేవలందిస్తారని తెలిపారు. దీంతో హైదరాబాద్‌లో ఉన్న ఆయన కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చామన్నారు. ప్రవీణ్‌ బావమరిది నిన్న సాయంత్రం వచ్చి అనుమానాస్పద మృతిగా ఫిర్యాదు ఇవ్వడంతో ఎఫ్ఐఆర్‌ నమోదు చేశామని ఎస్పీ నరసింహకిషోర్ వెల్లడించారు.

Category

🗞
News
Comments

Recommended