Visakha Stadium Renovation : మండే వేసవిలో ఆహ్లాదాన్ని పంచేందుకు ఐపీఎల్ సిద్ధమైంది. అభిమానులకు ఉత్కంఠ క్షణాలను అందించేందుకు కళ్లు చెదిరే షాట్లతో ప్లేయర్లు గ్రౌండ్లో విన్యాసాలు చేయనున్నారు. ఐపీఎల్ 18వ సీజన్ ఇవాళ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. మరోవైపు విశాఖ వేదికగా రెండు మ్యాచ్లు జరగనున్న విషయం తెలిసిందే. ఏసీఏ-వీడీఏసీ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో ఈ నెల 24న దిల్లీ క్యాపిటల్స్ - లఖ్నవూ సూపర్ జెయింట్స్, 30న దిల్లీ క్యాపిటల్స్ - సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్లు జరగనున్నాయి.