Warangal Vakula Drone Pilot Using Skills in Agriculture : వ్యవసాయం పురుషులు మాత్రమే చేయగలరు. మందుల పిచికారీ వంటివి వారికే సాధ్యం అవుతుందనే రోజులు పోయాయి. ఇప్పటికే పలురంగాల్లో ప్రత్యేకత చాటుతున్న మహిళామణులు వ్యవసాయ రంగంలోనూ తమదైన మార్క్ చూపించేందుకు సిద్ధమయ్యారు. అందుకు ఉదాహరణే ఆ యువతి. సాగులో సాంకేతికత కొత్తపుంతలు తొక్కుతున్న తరుణంలో డ్రోన్ టెక్నాలజీని అందుపుచ్చుకుంది. పురుషుల కంటే తామేం తక్కువ కాదని నిరూపిస్తూ వ్యవసాయ రంగంలో స్వయం ఉపాధి పొందుతోంది