Dastagiri Meet Kadapa SP: వివేకా కేసులో సాక్షులు వరసగా మరణిస్తున్న సందర్భంగా తనకు మరింత భద్రత పెంచాలని కోరుతూ ఈ కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరి పోలీసుశాఖకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కడప ఎస్పీ కార్యాలయానికి వచ్చి భద్రత కల్పించాలని వినతిపత్రం అందజేశారు. ఎస్పీ అందుబాటులో లేని కారణంగా కార్యాలయంలో విజ్ఞాపన పత్రం అందజేశారు.