Home Minister Anita and MP Kalisetti at Womens Day Celebrations : ఆడపిల్లలే ముఖ్యమని నేటి సమాజం భావిస్తోంది. అందుకే అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం సమాజ బాధ్యత అని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. విజయనగరంలోని రాజీవ్ క్రీడా మైదానంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా ఇంఛార్జ్ మంత్రి, హోం మంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిధిగా హాజరవ్వగా, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అతిది విజయలక్ష్మి గజపతిరాజు, జిల్లా కలెక్టర్ అంబేద్కర్, ఎస్పీ వకుల్ జిందల్, పలుశాఖల అధికారులు, మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.