Woman Kidnap in Rajanna Sircilla District : పనుల కోసం తీసుకున్న డబ్బులు ఇవ్వడం లేదని ఓ గుత్తేదారు, డబ్బులు తీసుకున్న వ్యక్తి తల్లిని కిడ్నాప్ చేసిన అమానవీయ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం కొడుముంజ గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన పల్లపు శ్రీనివాస్ చెరకు కోత కూలీలకు మేస్త్రీగా పని చేస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన లాల్ దేవకర్ వద్ద చెరకు కోత కోసం శ్రీనివాస్ రూ.3 లక్షలు తీసుకున్నాడు. కూలీలు రాకపోవడంతో దేవకర్, శ్రీనివాస్ మధ్య పలుమార్లు వాగ్వాదం చోటుచేసుకుంది.
డబ్బుల విషయమై దేవకర్, అతడి అనుచరులు బుధవారం శ్రీనివాస్ స్వగ్రామానికి వచ్చారు. శ్రీనివాస్ భార్య, తల్లిపై దాడి చేయగా అతని భార్య పక్కింట్లోకి వెళ్లి తలుపు వేసుకుని దాక్కుంది. దీంతో శ్రీనివాస్ తల్లి భీమాబాయిని బలవంతంగా కారులో ఎక్కించి తీసుకెళ్లారు. బీమాబాయి మనవడు వెంకటేశ్ తన నానమ్మను కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Be the first to comment