RTC Bus Overturned in Kolimigundla: నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కలవటాల సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. బస్సు జమ్మలమడుగు నుంచి తాడిపత్రికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. డ్రైవర్, కండక్టర్ సహా 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను బనగానపల్లి, అవుకు, కొలిమిగుండ్ల ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు. ఎవరికీ ప్రాణాపాయం లేనట్లుగా వైద్యులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సు డ్రైవర్ ఫోన్‌లో మాట్లాడుతున్నారని, వద్దని వారించినా వినలేదని ప్రయాణికులు తెలిపారు.
Be the first to comment