CM Revanth Reddy Comments On Indira Gandhi : పహల్గాం ఘటన తర్వాత ప్రధాని అంటే ఇందిరాగాంధీలా ఉండాలనే చర్చ వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆమె గతంలో పాకిస్థాన్‌తో యుద్ధం చేసి ఆ దేశాన్ని రెండు ముక్కలు చేశారని గుర్తుచేశారు. 50 ఏళ్ల తర్వాత కూడా ఇందిరాగాంధీ పేరు చెప్పుకొంటున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ఇవాళ ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించిన అనంతరం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు.
Be the first to comment