Dhimsa Dance at Vishakha Hotels : అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో జరుగుతున్న చలి ఉత్సవాన్ని అతిథిలకు తెలియజెప్పేవిధంగా విశాఖపట్నం స్టార్ హోటళ్ల వద్ద కళాకారులు ప్రదర్శనలు చేేస్తున్నారు. అల్లూరి జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి మేరకు కళాకారులను విశాఖలోని హోటళ్ల వద్ద అతిథులను పలుకరించేందుకు అనుమతించారు. దేశ విదేశాలనుంచి వచ్చే అతిథులకు, స్ధానికంగా వచ్చే అతిథులను వీరు గిరిజన సంప్రదాయ రీతిలో ఆహ్వానం పలుకుతున్నారు. థింసా నృత్యం వారికి పరిచయం చేసి, వారు కూడా ఈ నృత్యంలో భాగంగా పాదం కలిపేట్టుగా కళాకారులు ఉత్సాహపరుస్తున్నారు.
Comments