దావోస్ ఒప్పందాలతో 1.79 లక్షల కోట్ల పెట్టుబడులతో... అగ్రగామిగా రాష్ట్రం ప్రపంచదృష్టిని ఆకర్షిస్తోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. ఐటీ, ఫార్మా రంగాల్లో రాష్ట్రం దూసుకుపోతోందన్నారు. 76వ గణతంత్ర వేడుకల్లో భాగంగా... సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రసంగించిన గవర్నర్.. ప్రజాప్రభుత్వం తెలంగాణ సంస్కృతికి పెద్దపీట వేస్తుందని... అందెశ్రీ రాసిన జయజయహే గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించారన్నారు
Be the first to comment