JC Prabhakar Reddy Sorry To Ultratech Cement Industry : అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమకు బూడిద రవాణా చేసే లారీల విషయంలో వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డితో కొన్ని రోజులుగా కొనసాగుతున్న వివాదంపై టీడీపీ నేత, అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి స్పందించారు. అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ యాజమాన్యానికి క్షమాపణ చెప్పారు. పాండ్ యాష్పై ఆదినారాయణరెడ్డితో జరుగుతున్న గొడవతో పరిశ్రమకు, అక్కడ పని చేసే వేలాది మంది కార్మికులకు నష్టం జరగకూడదనే క్షమాపణ చెబుతున్నట్లు ఆయన వెల్లడించారు. తాను పాండ్ యాష్ కోసం పట్టుదలగా వ్యవహరిస్తున్నట్లు తన భార్య, కుమారులు హెచ్చరించడం వల్లనే మీడియా ముందుకు వచ్చి అల్ట్రాటెక్ యాజమాన్యానికి క్షమాపణ చెబుతున్నానని తెలిపారు.
Be the first to comment