MGNREGS Funds Issue in AP : కూటమి ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేసిన అధికారులు ఖర్చు చేయడం లేదు. ఆరు నెలల క్రితం వరకు నిధులు లేవంటూ కబుర్లు చెప్పి ఇప్పుడు పుష్కలంగా నిధులున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వీటి ఖర్చుపై కొన్ని జిల్లాల్లో కలెక్టర్ల స్థాయిలో సమీక్షలూ అంతంత మాత్రంగానే జరిగాయి. 11 జిల్లాల్లో కేవలం రూ.567.14 కోట్లే వెచ్చించారు. ఆ జిల్లాల కలెక్టర్లకు ఏమైందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనే సూచనలు వినిపిస్తున్నాయి.
Be the first to comment