CM Revanth on SC Classification : ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ అనుకూలమని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. చేవెళ్ల డిక్లరేషన్ ద్వారా ఎస్సీ వర్గీకరణపై పార్టీ వైఖరి ఖర్గే తెలిపారన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పునకు తమ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన గ్లోబల్ మాదిగ డే - 2024 కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వారం రోజుల్లో ఎస్సీ వర్గీకరణపై షమీమ్ అక్తర్ కమిషన్ నివేదిక వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఇబ్బందులు రాకుండా పకడ్బందీగా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ చేస్తామని పేర్కొన్నారు. రాజకీయ, అధికార నియామకాల్లో మాదిగలకు ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు. చరిత్రలో తొలిసారి ఓయూ వీసీగా మాదిగను నియమించామని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.
Be the first to comment