Fake Currency Gang Attack on Police : గురువారం అర్ధరాత్రి పోలీసులు వెళ్తున్న వాహనాన్ని దొంగనోట్ల ముఠా అడ్డగించి దాడికి దిగారు. మరో కారు, ఇతర వాహనాలతో వెనక నుంచి ఢీకొని పోలీసు బృందంపై దాడి చేసి వాహనంలో ఉన్న నిందితుడిని తప్పించారు. అడ్డొస్తే చంపుతామని పోలీసులను బెదిరించారు. మళ్లీ వెంట పడకుండా పోలీసుల వాహన తాళం తీసుకుని దుండగులు పరారయ్యారు. ఈ ఘటన తూర్పు గోదావరిలోని రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది.
Be the first to comment