Asha Workers Protest In Koti Hyderabad : హైదరాబాద్లోని కోఠిలోని డీఎంఈ కార్యాలయం గేటు ముందు ఆశావర్కర్లు ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం రూ.18వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆశావర్కర్లు పెద్ద ఎత్తున రోడ్డుపై బైటాయించారు. దీంతో డీఎంఈ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు, ఆశాలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కార్యాలయం లోపలికి తోసుకొని వెళ్లేందుకు ఆశలు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి విషమించడంతో పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆశలకు, పోలీసులకు తోపులాట, తీవ్ర వాగ్వివాదం జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Category
🗞
NewsTranscript
00:00Oh
00:30Oh
01:00Oh
01:30Oh
02:00Oh
02:30Oh