Parent Teacher Meeting in AP : ప్రైవేట్ పాఠశాలలకే పరిమితమైన పేరెంట్ - టీచర్ మీటింగ్ సర్కారీ బడుల‌్లోనూ జరగబోతోంది. నేడు ఒకేరోజు వేల ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించనున్నారు. బాపట్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేశ్, విద్యార్థుల ప్రగతి నివేదికలు పరిశీలించి తల్లిందండ్రులతో ముచ్చటిస్తారు. దేశంలో అతి పెద్ద రాష్ట్రాల్లో ఈ స్థాయిలో సమావేశం నిర్వహించడం ఇదే మొదటిసారి.