Devadula Pipeline Gatewall Leak : హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడపాక శివారులో దేవాదుల పైప్ లైన్ గేట్ వాల్ లీకై భారీగా నీరు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ వృథాగా పోతుంది. చుట్టూ పంట పొలాల్లోకి భారీగా నీరు చేరుతుంది. వరి పంట పొలాలు కోతదశలోకి రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పక్కనే విద్యుత్ వైర్లు ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి మరమ్మతు పనులు చేయాలని కోరుకుంటున్నారు.
Be the first to comment