Eluru Call Money Victims Issues : మంగళవారం వచ్చిందంటే చాలు వారిలో భయం మొదలవుతుంది. ఈ వారం ఎంత వడ్డీ కట్టమంటారో? ఎక్కడి నుంచి తేవాలో కట్టలేకపోతే ఎలాంటి బెదిరింపులు ఎదురవుతాయో? అనే భయం వారిని నిద్రపోనివ్వకుండా చేస్తుంది. అసలుకి అసలు వడ్డీకి వడ్డీ కట్టినా సరే డబ్బుల రూపంలో మనుషుల రక్తం తాగే వారి అత్యాశకు సరిపోయేది కాదు. ఉన్నదంతా ఊడ్చి వారి చేతుల్లో ధారపోసినా ఇంకా కట్టాల్సిందేననే సమాధానం విని బాధితుల గుండెలు బరువెక్కేవి. ఇదంతా దేని గురించి అనుకుంటున్నారా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక నేతలు సాగించిన కాల్‌మనీ దందాకు బలైన బాధితుల ఆవేదన.
Be the first to comment