Skip to playerSkip to main content
  • 8 years ago
Punjagutta Police files counter petition against Ghazal Srinivas bail plea.

మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో గాయకుడు గజల్ శ్రీనివాస్ ఇటీవల మరో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై పోలీసులు కౌంటర్ ఫైల్ దాఖలు చేశారు. గజల్ శ్రీనివాస్‌కు బెయిల్ ఇవ్వవద్దని కోరారు. ఏ2 నిందితురాలు పార్వతి పరారీలో ఉన్నారని, ఆమె కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. గజల్ కేసులో బాధితురాలి స్టేట్‌మెంట్ ఇంకా రికార్డ్ చేయాల్సి ఉందని చెప్పారు. బాధితులు పెరిగే అవకాశముందని, సాక్ష్యులను విచారించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
అయితే అంతకముందు మహిళల లైంగిక వేధింపుల కేసులో గాయకుడు గజల్ శ్రీనివాస్ బెయిల్, కస్టడీ పిటిషన్‌లపై న్యాయస్థానం తీర్పు కోసం నాంపల్లి కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. సెక్షన్ 354, 354ఏ బెయిలబుల్ కేసులు అయినప్పటికీ పోలీసులు బెయిల్ ఇవ్వలేదని గజల్ శ్రీనివాస్ తరఫు న్యాయవాదులు వాదించారు.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended