Chandrababu Review on Pensions : రాష్ట్రంలోని అర్హులందరికీ పింఛన్ అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అదే సమయంలో అనర్హులు స్వచ్ఛందంగా పెన్షన్లు వదులుకోవాలని పిలుపునిచ్చారు. తప్పుడు ధ్రువపత్రాలతో కొంతమంది దివ్యాంగుల కోటాలో పింఛన్లు పొందడం సరికాదన్నారు. ఇది వారికి అన్యాయం చేయడమేనని చెప్పారు. ఇలాంటి వాటిని గుర్తించి అనర్హులని ఏరివేసి, అర్హులకే పింఛన్ ఇచ్చేలా గ్రామ సభల్లో కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. విశాఖలో 30 ఎకరాల్లో రూ.200 కోట్లతో జాతీయ దివ్యాంగుల క్రీడా కేంద్రం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
Be the first to comment