CM Chandrababu on Pensions : కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకిచ్చిన మరో హామీని నెరవేర్చేందుకు ముందడుగు వేసింది. ఇకపై ఏ నెలలోనైనా పింఛను తీసుకోకపోతే ఆ మరుసటి నెల మొత్తం కలిపి ఇవ్వనున్నారు. రెండు నెలలు తీసుకోలేకపోతే ఆ తర్వాత నెలలో మూడు నెలల మొత్తం అందించనున్నారు. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. డిసెంబర్ నుంచే అమలుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.