New Excise Policy in AP : ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నూతన మద్యం విధానంలో సరసమైన ధరలకే నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది. ఏపీలో అక్టోబర్ 1 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని వెల్లడించింది. వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వ ఆదాయం పాలకుల జేబుల్లోకి వెళ్లిందని ఆక్షేపించింది. నాసిరకం బ్రాండ్లు తెచ్చి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడారని మండిపడింది. కొత్త మద్యం విధానంలో గీత కార్మికులకు 10 శాతం వైన్ షాపులు కేటాయించాలని ప్రతిపాదించినట్టు పేర్కొంది.
Be the first to comment