AP Liquor Sales : రాష్ట్రంలో కొత్త మద్యం దుకాణాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. వాటిలో డిజిటల్ పేమెంట్స్ సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చింది. దీంతో మద్యం ప్రియుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. గత సర్కార్లో నాసిరకం లిక్కర్ అమ్మారని మందుబాబులు ఆరోపించారు. ఊరుపేరు లేని లిక్కర్ ముంచెత్తిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాణ్యమైన మద్యం తక్కువ ధరలకు లభిస్తుందని వారు హర్షం వ్యక్తం చేశారు.
Be the first to comment