Balapur Ganesh 2024 : బాలాపూర్లో భారీ గణనాథుడు కొలువుదీరాడు. కోరిన వారి కోరికలు తీర్చే విఘ్నేశ్వరుడి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. 9 రోజుల పాటు భక్తులకు దర్శనమివ్వనున్నాడు. పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకుని గణపయ్య ఆశీస్సులు పొండుతున్నారు. బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా వేద పండితులు తొలి పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.