Prakasam Barrage damage gates Repair Work Started : ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్లకు నిపుణుల పర్యవేక్షణలో మరమ్మతులు జరుగుతున్నాయి. బ్యారేజ్ 67, 69 నెంబర్ గేట్లకు మరమ్మతు చేస్తున్నారు. నిపుణులు కన్నయ్యనాయుడు పర్యవేక్షణలో మరమ్మతు పనులు జరుగుతున్నాయి. బ్యారేజీ వద్ద ఇరుక్కున్న నాలుగు పడవలను బెకెమ్ ఇన్ ఫ్రా సంస్థ సిబ్బంది తొలగించనున్నారు. ఏడు రోజుల్లో బ్యారేజీ గేట్ల ఏర్పాటు పనులు పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పనిచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Be the first to comment