Flooded bike repair : వరద ముంపునకు గురైన విజయవాడ, ఖమ్మంలోని ప్రాంతాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. లక్షల మంది ఇళ్లు మునిగి, సామగ్రి వరదలో కొట్టుకుపోయి కట్టుబట్టలతో మిగిలారు. ముంపు ప్రాంతాల్లో లక్షలాది ద్విచక్ర వాహనాలు వరదలో మునిగిపోయాయి. అయితే, వాటి మరమ్మతు విషయంలో అప్రమత్తంగా ఉండాలని టెక్నీషియన్లు సూచిస్తున్నారు. ఇప్పటికే వరద కారణంగా నష్టపోయిన వారంతా అనాలోచిత నిర్ణయాలతో మరింత నష్టపోవద్దని చెప్తున్నారు.