Driving School Trainer Impressed with his Stunts: కదులుతున్న కారు నుంచి ఆమాతం దిగిపోతాడు. రన్నింగ్ కారుపై తాఫీగా కుర్చి వేసుకొని ఆసీనుడవుతాడు. వెనక సీటులో కూర్చొని స్టీరింగ్ తిప్పుతూ సరైన మార్గంలో కారుని నడుపుతాడు. అంతేకాదు అత్యంత రద్దీగా ఉన్న రహదారిపై వేగంగా స్టీరింగ్ పట్టుకోకుండా దూసుకుపోతాడు. కుడి కాలితో స్టీరింగ్ తిప్పుతు, గేర్లు మారుస్తు, ఇండికేటర్స్ వేస్తాడు. ఇదేదో సినిమాల్లో హిరోలు చేసిన స్టంట్ అనుకుంటున్నారా అదేమీ కాదు విజయనగరంలో ఓ డ్రైవింగ్ స్కూల్కు చెందిన శిక్షకుడు చేస్తున్న ఫీట్లు ఇవి. అబ్బుర పరిచే ఆ యువకుడు చేస్తున్న స్టంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Be the first to comment