Minister Sridhar Babu On Heavy Rains : ప్రకృతి విపత్తుల సమయంలో సహాయం చేయకుండా బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో చర్చిస్తూ సహాయక చర్యలను నిర్దేశించినట్లు వెల్లడించారు. మృతులకు పరిహారం ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చామన్న మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్రానికి సాయం చేయాలంటూ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాలకు విజ్ఞప్తి చేసినట్లు వివరించారు. సంక్షోభ సమయాల్లో బాధ్యతగా వచ్చి సాయం చేయాలే తప్ప రాజకీయం చేయడం తగదని మంత్రి శ్రీధర్ బాబు హితవు పలికారు.
Be the first to comment