CM Chandrababu on Gudlavalleru Hidden Camera Issue: గుడ్లవల్లేరు కళాశాల ఘటనపై విచారణ కొనసాగుతోందని, ఆడపిల్లల రక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. హాస్టల్లో ఎలాంటి హిడెన్ కెమెరాలు, వీడియోలు లేవని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ నేతల కుంభ కోణాలు, ముంబై సినీ నటి జత్వాని కేసుల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు బ్లూ మీడియా దీనిని తెరపైకి తీసుకొచ్చారని అన్నారు.