Registration Fees Hike in Telangana : భూములు, భవంతులు, ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలు పెరుగుతాయన్న ప్రభుత్వ ప్రకటనతో రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా పెరిగింది. ఏప్రిల్ నుంచి జులై వరకు తొలి నాలుగు నెలల్లో రూ.355 కోట్లు అదనంగా రాబడి వచ్చింది. ఆగస్టు నుంచి మార్కెట్ విలువలు పెరుగుతాయని షెడ్యూల్ విడుదల చేయడంతో గత కొన్ని రోజులుగా సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రద్దీ నెలకొంది. రెండు, మూడునెలల తర్వాత రిజిస్ట్రేషన్లు చేయించుకోవాల్సిన వారు ముందే చేయించుకుంటున్నట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు.
Be the first to comment