Govt Focus On Sewage System : రాష్ట్ర రాజధానిలో మురుగునీటి వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ముమ్మరంగా కృషి చేస్తోంది. జలమండలి ఆధ్వర్యంలో సుమారు 4 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న 31 మురుగునీటి శుద్ధి కేంద్రాలను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే నిర్మాణాలు పూర్తైన ఎస్టీపీలను ప్రారంభించేందుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది. ముగింపు దశకు చేరిన ఫతేనగర్, ఖాజాకుంట ఎస్టీపీల్లో ట్రయల్ రన్ నిర్వహిస్తోంది.