దూసుకెళ్తున్న కియా సోనెట్ బుకింగ్స్

  • 4 years ago
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్ కేంద్రంగా పనిచేస్తున్న కియా మోటార్స్ ఇండియా, ఇటీవలే భారత మార్కెట్లో విడుదల చేసిన సరికొత్త సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ అమ్మకాల పరంగా దూసుకుపోతోంది. ఈ మోడల్ కోసం ఇప్పటికే 50,000 యూనిట్లకు పైగా బుకింగ్స్ అందుకున్నట్లు కంపెనీ ప్రకటించింది.

కియా సోనెట్ కోసం ఆగస్టు 20వ తేదీ నుండే అధికారికంగా బుకింగ్స్ ప్రారంభించారు. కేవలం రెండు నెలల్లోనే ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ కొత్త మైలురాయిని సాధించినట్లు కంపెనీ తెలిపింది. కియా మోటార్స్ గత రెండు నెలల్లో ప్రతి మూడు నిమిషాలకు సగటున రెండు బుకింగ్‌లు అందుకున్నట్లు పేర్కొంది. ఈ మోడల్ మార్కెట్లో 12 రోజుల్లోనే మొత్తం 9,266 యూనిట్ల సోనెట్ వాహనాలను డెలివరీ చేసి మరో కొత్త రికార్డును సాధించింది.

Recommended