కియా వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన సోనెట్ ; ఆగస్ట్ 7న విడుదల

  • 4 years ago
ఇండియన్ మార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో పోటీ నానాటికీ పెరుగుతోంది. ఈ సెగ్మెంట్లో నిత్యం కొత్త మోడళ్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా కొరియన్ కార్ బ్రాండ్ కియా మోటార్స్ కూడా ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో ఓ సరికొత్త ఉత్పత్తిని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కియా సోనెట్ పేరుతో రానున్న ఈ కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని కంపెనీ ఆగస్ట్ 7వ తేదీన ఆవిష్కరించనుంది.

సబ్ 4-మీటర్ విభాగంలో విడుదల కానున్న కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని కంపెనీ మార్కెట్లో విడుదల చేయటానికి ముందే తమ అధికారిక ఇండియన్ వెబ్‌సైట్ ప్రోడక్ట్ జాబితాలో చేర్చింది. కియా సెల్టోస్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ మాదిరిగానే కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీకి కూడా భారతదేశం వేదికగా కియా మోటార్స్ ఆగస్టు 7, 2020వ తేదీన గ్లోబల్ ప్రీమియర్ నిర్వహించనుంది.

కియా వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన సోనెట్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.