హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ సంక్షోభం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ కేసుల తీవ్రత ఎప్పట్లాగే కొనసాగుతోంది. మరణాల సంఖ్యా పెరుగుతోంది. ప్రతిరోజూ రెండువేల వరకు పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. సగటున 10 మంది వరకు మరణిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 90 వేల మార్క్‌ను అధిగమించింది. రికవరీ రేటు ఆశించిన స్థాయిలో నమోదవుతోంది. డిశ్చార్జి అయిన వారి సంఖ్య 66 వేలను దాటుకుంది.
Be the first to comment