భారతదేశంలో ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఆంపియర్ వెహికల్స్ మాగ్నస్ ప్రో అనే కొత్త ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. కొత్త ఆంపియర్ మాగ్నస్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 73,990.
ఆంపియర్ బెంగుళూరులో కొత్త మాగ్నస్ ప్రోను ప్రారంభించినట్లు ప్రకటించింది. రాబోయే రెండు నెలల్లో కంపెనీ ఇతర నగరాల్లో కూడా అమ్మకాలను విస్తరించనున్నారు. ఆంపియర్ వెహికల్స్ మాగ్నస్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్ ప్రారంభించింది. ఈ స్కూటర్ డెలివరీలు త్వరలో ప్రారంభం కానున్నాయి.
Be the first to comment