కరోనా కారణంగా దేశంలో విధించిన లాక్‌డౌన్ సమయంలో తాము ఎక్కడ ఉన్నామో తెలపలేదనే కారణంతో ఐదుగురు భారత క్రికెటర్లకు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) నోటీసులు జారీ చేసింది. టీమిండియా ఆటగాళ్లు కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, రవీంద్ర జడేజాలతో పాటు మహిళా క్రికెటర్లు స్మృతి మంధాన, దీప్తి శర్మలు ఈ నోటీసులందుకున్నారు.