Skip to playerSkip to main contentSkip to footer
  • 2 days ago
అల్పపీడన ప్రభావంతో కామారెడ్డి, మెదక్‌, నిర్మల్‌ జిల్లాల్లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు కుంభవృష్టి కురిసింది. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్‌ జిల్లాలు భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి, మెదక్‌ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పంట పొలాలు, నివాస ప్రాంతాలు చెరువులను తలపించాయి. కామారెడ్డి - భిక్కనూర్‌ మార్గంలో రైలు పట్టాల కింద వరద పోటెత్తడంతో భారీ గండిపడింది. దీంతో అధికారులు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో వాగు పొంగడంతో కార్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. హౌసింగ్‌ బోర్డు కాలనీలో ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కామారెడ్డి, మెదక్‌ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో గురువారం ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. ఇవాళ మెదక్‌, నిర్మల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ పేర్కొంది. భారీ వర్షాలు, వరదల ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్‌రెడ్డి ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు.


📌 YouTube Description

Heavy rains lashed Kamareddy, Medak, and Nirmal districts due to a low-pressure system. From Tuesday night to Wednesday night, torrential rains created havoc, especially in Kamareddy and Medak, where floodwaters submerged residential areas and farmlands. Streams and canals overflowed, turning colonies into lakes.

🚨 Red Alert has been issued for Kamareddy and Medak districts. In Kamareddy, floodwater damaged the railway track on the Kamareddy–Bikkanur route, halting train services. Cars were swept away in Kamareddy town as overflowing streams flooded roads. Housing Board Colony residents faced severe hardship as floodwater entered homes.

👉 Authorities have declared a holiday for schools and colleges in Kamareddy and Medak districts. The Meteorological Department warned of heavy rainfall today in Medak and Nirmal districts.

🛑 Telangana CM Revanth Reddy will conduct an aerial survey of flood-affected regions to assess the situation.



#Kamareddy #KamareddyFloods #TelanganaRains #MedakFloods #NirmalRains #TelanganaNews #RevanthReddy #WeatherAlert #CMRevanthReddy #FloodVideos #FloodDroneVisuals #HeavyRain #FloodAlert #oneindiatelugu #OIUpdates #Oneindia

Also Read

విద్య సంస్థలు బంద్.. ఎందుకంటే...? :: https://telugu.oneindia.com/news/telangana/record-rains-in-kamareddy-district-trigger-widespread-flooding-schools-shut-down-449535.html?ref=DMDesc

కామారెడ్డికి కాళరాత్రే.. ఏ క్షణమైనా 'పోచారం ప్రాజెక్టు' తెగే ప్రమాదం.. ప్రాణాలు అరచేతిలో.. :: https://telugu.oneindia.com/news/telangana/dhoop-singh-thanda-submerged-heavy-rains-threaten-pocharam-project-in-medak-449515.html?ref=DMDesc

కామారెడ్డి కకావికలం- తెలంగాణలో రైళ్లకు గండం :: https://telugu.oneindia.com/news/telangana/telangana-rains-railway-track-washed-away-near-kamareddy-449471.html?ref=DMDesc



~PR.358~ED.232~HT.286~

Category

🗞
News
Transcript
00:00Thank you for listening.
00:30Thank you for listening.
01:00Thank you for listening.

Recommended