The monsoon has advanced into the southernmost parts of the Arabian sea, some more parts of the Maldives-Comorin, as well as the South-West and South-East Bay of Bengal and parts of the East Coast. #weather #monsoon #bayofbengal #kerala #tamilnadu #karnataka
రుతుపవనాలు మరో రెండు రోజుల్లో కేరళలో ప్రవేశించనున్నాయి. సాధారణంగా ప్రతి ఏడాది జూన్ 1వ తేదీన రుతుపవనాలు రావాల్సి ఉన్నా ఈసారి ఆలస్యమైనట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం అరేబియా సముద్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించి మాల్దీవులు, ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు అధికారులు చెప్పారు. సానుకూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో జూన్ ఆరున రుతుపనాలు కేరళలో ప్రవేశిస్తాయని ఐఎండీ ప్రకటించింది.