సంక్రాంతి పండగ వచ్చిందంలే రకరకాల పిండి వంటలు, కోడి పందాలు, రంగురంగుల పతంగిలు ఎగరవేయడం, ఇంటి ముందు పెద్ద పెద్ద రంగవళ్లులు ఇవన్నీ కనువిందు చేస్తుంటాయి. ఇవే కాకుండా నిండుగా అలంకరించిన గంగిరెద్దుల తో పాటు హరిదాసులు కూడా సంక్రాంతి పండుగకు ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తుంటారు. చేతిలో చిరుతలు, తలమీద అక్షయ పాత్ర, పంచకట్టు, పొడవైన జందెం, మూడు నామాలతో రామదాసు కీర్తనలు ఆలపిస్తూ ఇళ్ల ముందుకు వచ్చే హరిదాసులు అందరిని ఆకర్శిస్తుంటారు.