In a bid to curb fraudulent transactions, the State Bank of India (SBI) has made certain changes in the rules governing cash deposit into accounts. As per a new rule, one will not be able to deposit cash into another person’s account. #statebankofindia #sbirules #cashdepositrules #newrules #SBI
ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు డబ్బులు బదిలీ చేస్తుండటంలో మోసాలను అరికట్టేందుకు చర్యలు ప్రారంభించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఖాతాలోకి జమఅవుతున్న నగదుపై ఓ కన్నేసింది ఎస్బీఐ. డబ్బును ఒక ఖాతాలోకి వేసేముందు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. ఇందుకు సంబంధించి కొత్త నియమనిబంధనలను తీసుకురానుంది. కొత్త నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి మరో వ్యక్తి ఖాతాలోకి డబ్బులు వేయరాదు.సొంత కుటుంబ సభ్యులైనా సరే వారి కుటుంబ సభ్యుడి ఖాతాలో డబ్బులు వేయరాదంటూ కొత్త నిబంధన తీసుకురానుంది ఎస్బీఐ. ఇది అమల్లోకి వస్తే కొన్ని లక్షల మంది ఎస్బీఐ కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.