Skip to playerSkip to main contentSkip to footer
  • 7 years ago
In AP, the ruling party TDP and opposition party YCP leaders continue of words on various issues.
#andhrapradesh
#guntur
#tdp
#varlaramaiah
#karemsivaji
#ycp
#jagan
#cases
#pmmodi
#Roja
#ministers
జగన్ కేంద్రాన్ని మేనేజ్‌ చేయడం వల్లే అతడి అక్రమాస్తుల కేసుల విచారణ నత్తనడకన సాగుతోందని ఏపీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ్య ఆరోపించారు. కేసుల విచారణ ముగిస్తే జగన్‌కు జైలుశిక్ష ఖాయమని వర్ల తేల్చిచెప్పారు.
గుంటూరు పర్యటన సందర్భంగా వర్ల రామయ్య అక్కడ మీడియాతో మాట్లాడారు. రాజకీయ నాయకులపై ఉన్న కేసులను ఏడాదిలోగా పూర్తి చేస్తామన్న ప్రధాని మోడీ చెప్పిన మాట ఏమైందని వర్ల రామయ్య ప్రశ్నించారు. జగన్ కేంద్ర హోం శాఖను, ప్రధాని మోడీ, బిజెపిని మేనేజ్ చేయడం వల్లే ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లి వస్తున్నాడని, అంతకుమించి మరేమీ జరగడం లేదని ఆయన విమర్శించారు.జగన్ కేసుల విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని వర్ల రామయ్య కోరారు.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended