బాదం మీగడ పాయసం మన మనస్సుకి ఎంతో నచ్చే తీపి వంటకం, అంతర్లీనంగా కుంకుమపువ్వు వాసన, బాదంతో నిండిన, ఘుమాయించే భారతీయ దినుసులతో కూడిన ఒక చెంచా అన్నం పరమాన్నం కన్నా రుచిగా ఏముంటుంది?మనకి పాయసం లేదా పరమాన్నం ప్రతి పండగకీ, ఉత్సవాలకి తప్పనిసరి వంటకంగా మారిపోయింది. అందుకని, ఈ పండగ సమయంలో మనం బాదం మీగడ పాయసాన్ని ఇంట్లోనే సులభంగా ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.ఈ ప్రత్యేక బాదం మీగడ పాయసం రెసిపి ఏ పండగకైనా బావుంటుంది, దీన్ని వండటానికి కూడా పెద్ద సమయం పట్టదు. హాయిగా చేసుకుని నచ్చినంతసేపు తింటూ ఆనందించండి.