Skip to playerSkip to main contentSkip to footer
  • 7 years ago
Andhra Pradesh government today presented a Rs 1.91-lakh-crore budget, with a projected revenue surplus of Rs 5,235 crore, for financial year 2018-19, vowing to make "every citizen in this state a happy person".
ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురువారం శాసన సభలో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యమని ఆయన చెప్పారు. రూ.19,070తో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు. వ్యవసాయ రంగంలో 25 శాతం వృద్ధి రేటు సాధించామని చెప్పారు.

వరి, మొక్కజొన్న, పప్పు ధాన్యాల ఉత్పత్తి పెరిగిందన్నారు. వంద శాతం రాయితీతో సూక్ష్మ పోషకాలు అందిస్తున్నామని, విత్తణ పంపిణీలో జాతీయస్థాయి అవార్డు సాధించామన్నారు. ఏపీ వ్యవసాయ బడ్జెట్ రూ.19,070 కాగా, రెవెన్యూ వ్యయం రూ.18,602 కోట్లు. పెట్టుబడి వ్యయం రూ.468 కోట్లు.

రెండో అర్థ సంవత్సరంలో 24.5 శాతం వృద్ధి సాధించామని, జాతీయ స్థాయి వృద్ధిరేటుతో పోలిస్తే రాష్ట్ర వృద్ధిరేటు 14 శాతం అధికంగా నమోదయిందని చెప్పారు. రబీలో 42 శాతం వర్షపాతం తక్కువగా నమోదయిందని, వరి దిగుబడి స్వల్పంగా తగ్గినా హెక్టారుకు 5,176 కిలోల ఉత్పత్తి నమోదయిందన్నారు.

Category

🗞
News

Recommended