Skip to playerSkip to main content
  • 8 years ago
Kadapa Mp Ys Avinash Reddy house arrested on Sunday at Pulivendula.challenges between tdp and Ysrcp over Pulivendula development, both parties ready to disccussing on this issue on Sunday at Pulivendula.
పులివెందులలో అభివృద్దిపై బహిరంగ చర్చపై అధికార టిడిపి, ప్రతిపక్ష వైసీపీల సవాళ్ళు, ప్రతి సవాళ్ళతో ఆదివారం నాడు పులివెందులలో ఉద్రిక్తత నెలకొంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. బహిరంగ చర్చకు తాము సిద్దంగా ఉన్నామని టిడిపి ఎమ్మెల్సీ బీటెక్ రవి ప్రకటించారు. పులివెందుల నుండి తాము పారిపోలేదని చెప్పారు.మరో వైపు వైసీసీ కార్యాలయంలో కూడ చర్చలకు తాము సిద్దంగా ఉన్నామని బీటెక్ రవి అన్నారు.

కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని ఆదివారం నాడు పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. పులివెందుల అభివృద్ధిపై చర్చ విషయమై కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పూల అంగళ్ళ సర్కిల్‌ వద్దకు వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. పాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వద్ద ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయనను అక్కడి నుంచి పోలీస్‌స్టేషన్‌కు తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు మార్గమధ్యలో అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని హౌజ్ అరెస్ట్ చేశారు.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended