Skip to playerSkip to main contentSkip to footer
  • 8 years ago
Tribal devotees washed the road, which according to their belief, was the road Sammakka used to make her way towards Medaram from Chilakalagutta, about 2 km from Medaram.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శుక్రవారం మేడారంలోని సమ్మక్క, సారలమ్మ గద్దెలను దర్శించుకున్నారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉపరాష్ట్రపతి పర్యటన సందర్భంగా మేడారంలో భారీ భద్రత ఎర్పాటుచేశారు. ఉపరాష్ట్రపతి వెంట తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. ఆదివాసీ కుంభమేళ మేడారం జాతరను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. జాతరకు రావడం సంతోషంగా ఉందన్నారు. మేడారానికి వచ్చి అవతార మూర్తలను దర్శించకోవడం గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆది,వేద కాలం నుంచి వస్తున్న ఆచారాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
మేడారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా వనదేవతలు సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు. అనంతరం అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సీఎం కేసీఆర్ వనదేవతలకు పట్టువస్త్రాలు సమర్పించారు. గద్దెల వద్దకు బంగారాన్ని మోసుకెళ్లి వనదేవతలకు సమర్పించారు. సీఎం కుటుంబసమేతంగా పగిడిద్దరాజు, గోవిందరాజులకు మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు. సీఎం సతీమణి శోభ, మనవడు హిమాన్షు, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, స్పీకర్ మధుసూదనాచారి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు అమ్మవార్లను దర్శించుకున్నారు.

Category

🗞
News

Recommended